మళ్లీ రిలీజ్‌ అవుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌, ఎక్కడో తెలుసా? | RRR Movie To Release On October 21 In Japan | Sakshi
Sakshi News home page

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌కు రంగం సిద్ధం, ఎక్కడంటే?

Jul 21 2022 8:51 PM | Updated on Jul 21 2022 9:01 PM

RRR Movie To Release On October 21 In Japan - Sakshi

సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ దాని క్రేజ్‌ తగ్గలేదు. తాజాగా జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయింది ఆర్‌ఆర్‌ఆర్‌. అక్టోబర్‌ 31న జపాన్‌లో విడుదల కానున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

ఇండియన్‌ సినిమాను మరో రేంజ్‌కు తీసుకువెళ్లిన వ్యక్తి రాజమౌళి. ఆయన తీసిన బాహుబలి చిత్రాలు ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అంతకుమించి అనేలా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తెరకెక్కించాడు రాజమౌళి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్‌ హీరోయిన్లుగా నటించారు.

మార్చి 25న రిలీజైన ఈ పాన్‌ ఇండియా మూవీ రూ.100 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ దాని క్రేజ్‌ తగ్గలేదు. తాజాగా జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయింది ఆర్‌ఆర్‌ఆర్‌. అక్టోబర్‌ 31న జపాన్‌లో విడుదల కానున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. మరి ఈ మూవీ అక్కడ ఎలాంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి.

చదవండి: ప్రాణాంతక వ్యాధి బారిన హీరోయిన్‌, 2 సార్లు చావు అంచుల వరకు..
 మంచు లక్ష్మి గొప్ప మనసు, గవర్నమెంట్‌ స్కూళ్లు దత్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement