ఆర్‌ఆర్‌ఆర్‌ : పవర్‌ఫుల్‌ లుక్‌లో అజయ్‌ దేవగన్‌ | RRR Movie: Ajay Devgan First Look Motion Poster Released On His Birthday | Sakshi
Sakshi News home page

అజయ్‌ దేవగన్‌ మోషన్‌ పోస్ట‌ర్‌ రిలీజ్‌

Apr 2 2021 12:00 PM | Updated on Apr 2 2021 1:55 PM

RRR Movie: Ajay Devgan First Look Motion Poster Released On His Birthday - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). ఈ సినిమాలో అజయ్‌ దేవగన్ జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల గురువుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫ్లాష్‌బాక్‌ సీన్లలో కనిపించనున్నట్లు సమాచారం. అతనికి జంటగా శ్రియ శరణ్‌ నటించనుంది శుక్రవారం (ఏప్రిల్‌2)న ఆయన పుట్టినరోజు కావడంతో ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్‌ దేవగన్‌‌ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్‌,రామ్‌చరణ్, ఒలివియా, ఆలియాభట్‌ ఫస్ట్‌లుక్‌లను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' వీడియోలు రికార్డులు క్రియేట్‌ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడం, స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.

చదవండి : రాజమౌళి నిర్ణయంతో వకీల్‌సాబ్‌ నిర్మాత అప్‌సెట్‌!
ఆర్‌ఆర్‌ఆర్‌ : రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్టిచ్చిన రాజమౌళి

Advertisement
 
Advertisement
Advertisement