Ram Charan Birth Day Surprise: New Poster From RRR Movie as Rama Raju- Sakshi
Sakshi News home page

'రామరాజు'గా రామ్‌చరణ్‌ పోస్టర్‌ విడుదల

Mar 26 2021 4:46 PM | Updated on Mar 26 2021 6:32 PM

SS Rajamouli Release A New Poster Of Ram Charanfrom From RRR movie - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్)‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ  సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తుండగా, రామ్‌ చరణ్‌  అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. రేపు(మార్చి27)న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చేసింది చిత్ర బృందం. ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరి సీతారామరాజు ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది. చేతిలో విల్లు పట్టుకొని అల్లూరి సీతారామరాజుగా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు రామ్ చరణ్.

రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదల చేసిన కామన్‌ డీపీ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. క్రియేటివ్‌గా కాకుండా ఓ సాదాసీదా ఫొటోను వదిలారంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని కూల్‌ చేసేందుకు మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్‌ను సంతృప్తి పరుస్తుంది. ​ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌కు జోడీగా సీతగా ఆలియా భట్‌ నటిస్తుంది. ఈ మూవీని అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

చదవండి : ఆర్‌ఆర్‌ఆర్‌: సీత వచ్చేసిందిగా
ఆర్‌ఆర్‌ఆర్‌: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్‌!

Advertisement
 
Advertisement
Advertisement