Rashmika Mandanna: ముదిరిన వివాదం.. రష్మిక మందన్నాపై బ్యాన్‌? నిజమేనా?

Is Rashmika Mandanna Banned From Kannada Industry - Sakshi

స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా మొదటి చిత్రం కిరిక్‌ పార్టీ. తర్వాత తెలుగులో ఛలో, గీతాగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు హిట్స్‌తో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిన ఆమె బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలూ చేస్తోంది. ఇకపోతే కర్ణాటకలో పుట్టి కన్నడలో మొదటి హిట్‌ అందుకున్న రష్మిక తన సొంత ఇండస్ట్రీని చులకన చేసిందంటూ నెట్టింట తెగ ట్రోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే!

ఇందుకు కాంతార మూవీ కారణం. ఈ చిన్న సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. అయితే ఇంతవరకూ ఈ సినిమా చూడనేలేదని, అంత టైం లేదని చెప్పిందీ నేషనల్‌ క్రష్‌. అంతేకాదు, ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా గురించి చెప్పేటప్పుడు సోకాల్డ్‌ బ్యానర్‌లో చేశానంటూ నిర్మాణ సంస్థ పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఇది కన్నడిగులకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్‌ సినిమా బ్యానర్‌ కూడా తెలీదా? సో కాల్డ్‌ బ్యానర్‌ అని యాక్ట్‌ చేసి చెప్పడం ఎందుకు? అంత యాటిట్యూడ్‌ అవసరమా? అంటూ కన్నడిగులు మండిపడ్డారు.

అటు రిషబ్‌ శెట్టి సైతం రష్మికపై పరోక్షంగా కామెంట్స్‌ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో కన్నడ ఇండస్ట్రీలో రష్మికను బ్యాన్‌ చేయనున్నారంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బ్యాన్‌ చేసేంత తప్పు రష్మిక ఏం చేయలేదని వెనకేసుకొస్తున్నారు ఆమె అభిమానులు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ కన్నడిగులు ఆమె మీద ఆగ్రహంతో ఊగిపోతున్న మాట వాస్తవమనే తెలుస్తోంది.

చదవండి: గల్వాన్‌ ట్వీట్‌ దుమారం.. భారత సైన్యానికి సారీ చెప్పిన నటి
ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top