వర్మ 'ఆర్జీవీ మిస్సింగ్‌' ట్రైలర్‌ విడుదల

Ram Gopal Varmas RGV Missing Official Trailer Released - Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'ఆర్జీవీ మిస్సింగ్' సినిమా ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది. వర్మ నిన్న ప్రకటించిన విధంగానే దసరా రోజున చెప్పిన సమయం కంటే ఓ 20 నిమిషాలు ముందే ట్రైలర్‌ను విడుదల చేశారు. వర్మ మిస్సయిన ఘటనకు సంబంధించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ టీజర్‌లో పలువురు టాలీవుడ్‌ స్టార్లు, పలువురు రాజకీయ ప్రముఖుల్ని పోలిన నటులు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదలైన విషయం తెలిసిందే.  (ప్రేమించిన హీరో.. విషాదాన్ని పంచిన విలన్)

కథ విషయానికొస్తే.. ఆర్జీవీ మిస్ అయ్యాడనే షాకింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆర్జీవీ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అ​యితే పోలీసులు దీన్ని కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్‌గా భావించి లైట్ తీసుకుంటారు. కానీ అదే నిజమని నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత ముగ్గురిని నిందితులుగా భావించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తారు. వారి విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటారు. ఈ విధంగా కథ సాగుతుంది. ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వర్మ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top