
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ నేపద్యంలో చిత్తూరు జిల్లా కుప్పంలో చరణ్, తారక్ అభిమానుల మద్య టికెట్ల విషయంలో రచ్చ జరిగినట్టు సమాచారం. టికెట్లపై ఓ హీరో అభిమాన సంఘం నాయకుల పేర్లు ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక దీంతో మరో హీరో అభిమానులు కోపంతో 'ఆర్‌ఆర్‌ఆర్' టికెట్లను చించేసినట్టు సమాచారం.