నటుడు రజనీకాంత్( Rajinikanth) హీరోగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు వసంత్ రవి,రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ముఖయ పాత్రలు పోషించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాప్ తదితర స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిన ఈ చిత్రంలో నటి తమన్న ఐటమ్ సాంగ్‌లో నటించారు. 2023లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో తాజాగా జైలర్– 2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర షూటింగ్ పలు ప్రదేశాలో జరుపుకుంది. చివరిగా గోవాలో చిత్రీకరణను జరుపుకుంది. ఇందులో పాల్గొన్న రజనీకాంత్ తన షూటింగ్‌ను పూర్తి చేసుకుని తాజాగా చెన్నైకి తిరిగి వచ్చారు.
ఆయన్ని చెన్నై విమానాశ్రయంలో పలువురు అభిమానులు కలిసి ఫొటోలు దిగారు. కాగా రజనీకాంత్ తదుపరి సుందర్.సీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈయన చాలా కాలం క్రితం సుందర్.సీ దర్శకత్వంలో నటించిన అరుణాచలం చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తాజాగా మరోసారి ఈ కాంబోలో చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వినోదాన్ని మేళవించిన కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం.
కాగా ఈ చిత్రం తరువాత రజనీకాంత్, కమలహాసన్ కాంబోలో చిత్రం తెరకెక్కుతుందని తెలిసింది. దీన్ని రజనీకాంత్ ,కమలహాసన్‌ల వారుసురాళ్లు, సౌందర్య రజనీకాంత్, శృతీహాసన్ కలిసి నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రేజీ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను కమలహాసన్ పుట్టిన రోజు అయిన ఈ నెల 7న రజనీకాంత్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ప్రకటన కోసం ఈ ఇద్దరు స్టార్స్ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
