Pawan Kalyan Hari Hara Veera Mallu New Poster Out, Post Viral - Sakshi
Sakshi News home page

Pawan Kalyan Movie Poster: 'హరిహరి వీరమల్లు' నుంచి పవన్‌ న్యూ లుక్‌ చూశారా?

Apr 10 2022 1:03 PM | Updated on Apr 10 2022 1:51 PM

Pawan Kalyan Hari Hara Veera Mallu New Poster Out - Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా  ‘హరిహర వీరమల్లు’.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటుంది. నేడు(ఆదివారం) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్‌ ఈ చిత్రం నుంచి పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అగ్రెసివ్‌ లుక్‌లో కనిపిస్తున్న పవన్‌  ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఏఎమ్ ర‌త్నం, ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడిగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రిలు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా  “హరి హర వీర మల్లు” సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement