నేటి భారతం | Sakshi
Sakshi News home page

నేటి భారతం

Published Sun, Feb 18 2024 12:37 AM

NETI BHARATHAM  Movie Trailer Launch - Sakshi

ఒకే ఒక్క పాత్రతో సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం ‘నేటి భారతం’. యర్రా శ్రీధర్‌ రాజు నటించి, నిర్మించిన ఈ సినిమాకు భరత్‌ పారేపల్లి దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘‘కరోనా తర్వాత ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో నేను జర్నలిస్టు పాత్ర చేశాను. సింగిల్‌ క్యారెక్టర్‌తో వస్తోన్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శ్రీధర్‌.

Advertisement
 
Advertisement