‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్‌ పూర్తి చేసుకున్న చైతన్య | Naga Chaitanya Wraps UP Laal Singh Chaddha Movie Shooting | Sakshi
Sakshi News home page

‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్‌ పూర్తి చేసుకున్న చైతన్య

Aug 12 2021 10:07 AM | Updated on Aug 12 2021 10:33 AM

Naga Chaitanya Wraps UP Laal Singh Chaddha Movie Shooting - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తు‍న్న సంగతి తెలిసిందే. ఇందులో చైతూ ఆర్మీ ఆఫీసర్‌ బాలాగా కనిపించగా ఆమిర్‌ లాల్‌ సింగ్‌ పాత్ర పోషించాడు. ఇటీవల ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొన్న చైతన్య తాజాగా తన వంతు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘లాల్‌సింగ్‌ చద్దా’ మూవీ టీం సెట్‌లో కేక్‌ కట్‌ చేసి సందడి చేశారు.

ఇందులో ఆమిర్‌ చైతన్యకు కేక్‌ తీనిపించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కఇటీవల కార్గిల్, లడఖ్, శ్రీనగర్‌ లొకేషన్స్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌లో పాల్గొన్నాడు చైతన్య. ఈ షెడ్యూల్స్‌లో ఆమిర్, చైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్రదర్శకుడు అద్వైత్‌ చందన్‌. కాగా చైకి హిందీలో ఇది తొలి చిత్రం కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement