Mohan Lal Barroz Movie First Look Poster Released Post Viral- Sakshi
Sakshi News home page

Mohan Lal: మోహన్‌ లాల్‌ కొత్త అవతారం.. అదిరిపోయిందిగా ఫస్ట్‌ లుక్‌

Jan 2 2022 3:08 PM | Updated on Jan 2 2022 3:33 PM

Mohan Lal Barroz Movie First Look Poster Released - Sakshi

Mohan Lal Barroz Movie First Look Poster Released: ప్రముఖ నటుడు మోహన్‌ లాల్‌ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన మెగాఫోన్‌ పట్టుకొని దర్శకుడిగా మారారు. మోహన్‌లాల్‌ తొలిసారిగా డైరెక్ట్‌ చేస్తున్న సినిమా 'బరోజ్‌'. ఈ చిత్రంలో ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు మోహన్‌ లాల్‌. ఈ పోస్టర్‌లో మోహన్‌ లాల్‌ గుండు, గుబురు గడ్డం, మీసంతో బంగారు సింహాసనంపై దర్జాగా కూర్చున్నారు. మోహన్‌ లాల్‌ సరికొత్త  లుక్‌ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో మోహన్‌ లాల్‌ 'బరోజ్‌' అనే జీనీ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. 

మోహన్‌ లాల్‌ ఈ పోస్టర్‌ను ప్రకటిస్తూ 'మనముందు మరో సంవత్సరం ప్రకాశించనుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది మీకు అత్యంత విలువైన కాలంగా మారాలని ఆశిస్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్‌. బరోజ్‌ ఫస్ట్‌ లుక్‌.' అని పోస్ట్‌ చేశాడు. ఈ బరోజ్ చిత్రం మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాను త్రీడీ విధానంలో చిత్రీకరిస్తున్నారు. ఇండియాలోనే మొదటి త్రీడీ చిత్రం మై డియర్‌ కుట్టిచాతన్‌కు దర్శకత్వం వహించిన జిజో పున్నూస్‌ కథను అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా సంతోష్‌ శివన్‌ చేయనున్నారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్‌ లాల్‌ నటిస్తున్నాడు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement