
మెగా హీరో వరుణ్‌తేజ్ కోవిడ్ నుంచి బయటపడ్డారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనతో పాటు హీరో రామ్‌చరణ్‌కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం రోజుల అనంతరం నిర్వహించిన పరీక్షలో వరుణ్‌తేజ్‌కి కరోనా నెగటివ్ అని తేలడంతో సంతోషంలో మునిగితేలారు. 'నెగటివ్ అనే రిపోర్టు ఇంత ఆనందాన్ని ఇస్తుందని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ హీరో వరుణ్ ట్వీట్ చేశారు. కోవిడ్ నెగిటివ్ వచ్చిందని, తన కోసం ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ కృతఙ్ఞతలు అని వరుణ్ పేర్కొన్నారు. మరోవైపు హీరో రామ్‌చరణ్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ అందకపోవడంతో మెగా అభిమానుల్లో కలవరం మొదలైంది. రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. (ఇలాంటివి తక్షణమే మానేయండి: అనుష్క శర్మ )