తెగ వైరలవుతోన్న మహేష్‌ బాబు ఫోటో

Mahesh Babu Loved Up Pic With Wife Namrata Shirodkar - Sakshi

సినీ ఇండస్ట్రీలో ఆదర్శదంపతుల్లో ముందు వరుసలో ఉంటారు మహేష్‌ బాబు-నమ్రతా శిరోద్కర్‌. మిస్‌ ఇండియా, హీరోయిన్‌ అయినప్పటికి కుటుంబం కోసం తన కెరీర్‌ని త్యాగం చేశారు నమ్రత. మహేష్‌ బాబుకు గైడ్‌, ఫ్రెండ్‌, మెంటార్‌ అన్ని తానే. ఈ విషయాన్ని‌ పలు ఇంటర్వ్యూల్లో  స్వయంగా వెల్లడించారు మహేష్‌ బాబు. తన సక్సెస్‌కి నమ్రతనే కారణం అంటూ ప్రశంసలు కురిపించే విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో మహేష్‌, నమ్రతను పట్టుకుని.. కెమరా వైపు చూస్తున్నారు. ‘మన ఉనికికి మూల కారణం.. నాకు ఎక్కువ నమ్మకం కలిగించే విషయం ఏంటంటే ప్రేమతో పాలించడం. లవ్‌ మాత్రమే మనల్ని సంతోషంగా ఉంచగలదు.. దయ, తాదాత్మ్యం, కరుణ అన్నీ ప్రేమ భావోద్వేగం నుంచే పుట్టుకొస్తాయి. ప్రేమ అనేది నిజమైన, అత్యున్నతమైన భావోద్వేగం. ఒకరిపట్ల ఒకరు ప్రేమగా, దయగా ఉండండి. ఉన్నది ఒకటే జీవితం.. ప్రేమతో జీవించండి. ఇదే నా నిజమైన ఆనందం’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: వావ్‌..‘మైండ్‌ బ్లాక్‌’ చేసిన సితార)

మరో విశేషం ఏంటంటే సితార ఈ ఫోటోని తీసింది. దాంతో అభిమానులు ఫోటో సూపర్‌.. క్రెడిట్‌ అంతా సీతూ పాపదే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక నమ్రత మహేష్‌ బాబుకి సంబంధించి ఇలాంటి థ్రో బ్యాక్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్‌ బాబు సర్కార్‌ వారి పాటలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top