
నటించే ప్రతిఒక్కరూ స్టార్స్ అయిపోరు. వారి యాక్టింగ్ స్కిల్స్‌ను బట్టి, హిట్టు కొట్టే సినిమాలను బట్టి, అభిమాన బలగణాన్ని బట్టి స్టార్లుగా గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే హీరో మహేశ్ బాబు తొలి సినిమాకే స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకుని అనతి కాలంలోనే సూపర్ స్టార్‌గా ఎదిగాడు.
లవ్, యాక్షన్, సస్పెన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో అన్నివర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతూ అందరివాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆగస్టు 9న మహేశ్ బర్త్‌డే. ఈ తరుణంలో కనివినీ ఎరుగని రీతిలో పుట్టినరోజు వేడుకలు జరుపుదామని ఫిక్సయ్యారు ఆయన ఫ్యాన్స్. ఎప్పుడు ఏం చేయాలో ప్లాన్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. సర్కారువారి పాట ఫస్ట్ లుక్ కౌంట్‌డౌన్ జూలై 30న మొదలవుతుందని చెప్పారు. బర్త్‌డే కౌంట్‌డౌన్ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
SSMB birthday celebration plan.
— BARaju's Team (@baraju_SuperHit) July 16, 2021
Get ready to celebrate in never before way. @urstrulyMahesh#ReigningSSMBBirthdayFEST #SarkaruVaariPaata #SSMB28 pic.twitter.com/57eOg98uXp