యువతరం ఆలోచనలతో...

Madhi Movie Trailer Launch Event - Sakshi

శ్రీరామ్‌ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మది’. రామ్‌ కిషన్‌ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు సుమన్, నటి ఆమని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ ధనుష్‌ మాటాడుతూ– ‘‘యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా వినూత్నరీతిలో ఈ కథ సాగుతుంది’’ అన్నారు.

‘‘నటుడు కావాలని వచ్చిన నేను.. నా ఫ్రెండ్‌ బాధ చూడలేక ఈ చిత్రంతో నిర్మాతగా మారాను’ అన్నారు రామ్‌ కిషన్‌. ‘‘ఈ చిత్రంలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది’’ అన్నారు శ్రీరామ్‌. కో ప్రొడ్యూసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్‌ గుప్త, దర్శకుడు జై శంకర్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ ఠాగూర్, సంగీతం: పీవీఆర్‌.రాజా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top