కేటీఆర్​కు ‘సర్​..’ అంటూ సోనూసూద్​ రిప్లై

KTR Sonu Sood Superhero Gesture In Twitter - Sakshi

హైదరాబాద్​: కరోనా కాలంలో ఆపదలో ఉన్నవాళ్లు సాయం కోసం సోషల్​ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను, రాజకీయ నేతలను, పొలిటికల్​  పార్టీల అకౌంట్లను సాయం కోసం ట్యాగ్ చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ మంత్రి కేటీఆర్​కు రోజూ వందల కొద్దీ రిక్వెస్ట్​లు వస్తున్నాయి. వాటిలో తనకు వీలైనంత వరకు సాయం చేస్తున్నాడాయన. రీసెంట్​గా సాయం అందుకున్న ఓ వ్యక్తి కేటీఆర్​ను ‘సూపర్​హీరో’గా పొగడగా.. అందుకు సోనూసూద్ అర్హుడంటూ కేటీఆర్​ బదులిచ్చారు.
 
తనకు దక్కిన సాయానికి కృతజ్ఞతగా నందకిషోర్ అనే వ్యక్తి ట్విట్టర్​లో ఒక పోస్ట్ పెట్టాడు. ​ఆక్సిజన్ కాన్​సన్ట్రే​టర్​ను అడగ్గానే.. అందేలా చూసినందుకు థ్యాంక్స్​తో సరిపెట్టలేనని ఆ వ్యక్తి పోస్టు చేశాడు. అడిగిన వెంటనే సాయం అందించనందుకు కృతజ్ఞతలని, తెలంగాణ ప్రజలకు మీతరపున అందుతున్న సాయం మరువలేనిదని, చివరగా మీరు సూపర్​ హీరో అని చెప్పాలనుకుంటున్నానని నందకిషోర్​ ట్వీట్ చేశాడు. 

బ్రదర్​ అంటూ..
దానికి ప్రతిగా కేటీఆర్​ స్పందిస్తూ.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా తోచిన సాయం మాత్రమే చేశాను బ్రదర్​.. మీరు సోనూసూద్​ను(ట్యాగ్ చేసి మరీ) సూపర్​ హీరో అనడం కరెక్ట్​. ఆపదలో ఉన్నవాళ్లు మీరు సాయం అందించండి అని ఆ వ్యక్తికి సూచించాడు. కేటీఆర్​ రిప్లైకి సోనూసూద్ కూడా స్పందించారు. 

‘థ్యాంక్​ యూ సో మచ్​ సర్. కానీ, తెలంగాణకు మీరు ఎంతో చేస్తున్నారు. కాబట్టి మీరే రియల్​ హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ నాకు మరో ఇంటిలాంటిది. ఏళ్లుగా ఇక్కడి జనాలు నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అని సోనూసూద్​  రీ ట్వీట్​ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top