Kollywood Producer SS Chakravarthy Passes Away - Sakshi
Sakshi News home page

S. S. Chakravarthy: చిత్ర పరిశ‍్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

Apr 29 2023 12:29 PM | Updated on Apr 29 2023 12:47 PM

Kollywood Producer SS Chakravarthy Passes Away - Sakshi

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎస్‌ ఎస్‌ చక్రవర్తి(53) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చక్రవర్తికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన తనయుడు జానీ రేణిగుంట అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

(చదవండి: అందరి ముందు ఎన్టీఆర్‌ నా కాళ్లు పట్టుకున్నారు!: రోజా రమణి)

1997 లో ‘రాశి’ అనే చిత్రంతో ఆయన నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరో అజిత్ కుమార్ తో వాలి, రెడ్, సిటిజెన్, మగవారే, ఆంజనేయ అనే చిత్రాలను తెరకెక్కించారు.  తన కెరీర్‌లో అత్యధిక సినిమాలు అజిత్‌తోనే నిర్మించాడు. శింబు హీరోగా నటించిన కాలై, వాలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. నిర్మాత చక్రవర్తి మరణంతో కోలీవుడ్‌ విషాదంలో మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement