బాలీవుడ్‌ తారల ‘రొమాంటిక్‌’ హోలీ.. పిక్స్‌ వైరల్‌

Kiara Advani, Ananya Pandey, Other Bollywood Stars Celebrate Holi Festival, Pics Viral - Sakshi

కులమతాలకతీతంగా ప్రజలందరూ ఆనందంగా జరుపుకునే పండగల్లో హోలీ ఒకటి. నేడు, రేపు దేశవ్యాప్తంగా ఈ రంగుల పండగ జరగనుంది. ఇప్పటికే చాలా చోట్ల హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. కొత్త వసంతానికి స్వాగతం పలుకుతూ జనాలు సంతోషంగా హోలీ ఆడుతున్నారు. చిన్నా, పెద్దా.. పేద , ధనిక తారతమ్యం లేకుండా అంతా కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. సినీ తారలు సైతం హోలీ పండగను సెలెబ్రేట్‌ చేసుకుంటున్నారు.

బాలీవుడ్‌ బ్యూటీ కియరా అద్వానీ తన భర్త సిద్దార్థ్‌ మల్హొత్రతో కలిసి తొలిసారి హోలీ ఫెస్టివల్‌ని సెలబ్రేట్‌ చేసుకుంది. పండగ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. భర్త సిద్ధార్థ్ ముఖానికి కియారా స్వయంగా రంగులు పూశారు. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీరితో పాటు అనన్య పాండే, మల్లికా షెరావత్‌, కరణ్‌ జోహార్‌ తదితర బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ‘రొమాంటిక్‌’గా హోలీ పండను సెలబ్రేట్‌ చేసుకున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top