
వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించి కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగిపోయేలా చేసిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది కేజీయఫ్ 2. తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్...
KGF Chapter 2 Trailer Release Date: కేజీయఫ్.. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దాని క్రేజ్ అలాగే ఉంది. కేజీయఫ్ మూవీ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయేవాళ్లు చాలామందే ఉన్నారు. వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించి కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగిపోయేలా చేసిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది కేజీయఫ్ 2. కరోనా వల్ల కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలవుతోంది. ఈ క్రమంలో తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.
మార్చి 27న సాయంత్రం 6.40 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రాఖీ భాయ్ యశ్ గుర్రుగా చూస్తున్న ఫొటోతో ఓ పోస్టర్ వదిలింది. కాగా ఇప్పటికే కేజీయఫ్ 2 నుంచి టీజర్ విడుదలవగా దీనికి 240 మిలియన్ల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. టీజర్‌కే యూట్యూబ్‌ను దద్దరిల్లేలా చేసిన ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజయ్యాక ఇంకెంత హంగామా చేస్తారో! ఈసారి కేజీయఫ్ 2 ట్రైలర్ ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి! ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్, రవీనా టండన్, రావు రమేశ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందించారు.
There is always a thunder before the storm ⚡#KGFChapter2 Trailer on March 27th at 6:40 pm.
— Hombale Films (@hombalefilms) March 3, 2022
Stay Tuned: https://t.co/QxtFZcv8dy@Thenameisyash @prashanth_neel@VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7
#KGF2TrailerOnMar27 pic.twitter.com/4TBuGaaUKh