ఆహా.. బయలుదేరిందయ్యా.. కీర్తి ట్వీట్‌ చూశారా? | Keerthy Suresh's Raghu Thatha Gearing Up For Release | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: ఆహా.. బయలుదేరిందయ్యా.. కీర్తి పోస్ట్‌ చూశారా?

Jan 4 2024 8:29 AM | Updated on Jan 4 2024 9:09 AM

Keerthy Suresh Raghu Thatha Gearing Up for Release - Sakshi

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేజీఎఫ్‌, సలార్‌ వంటి సంచలన చిత్రాలను నిర్మించిన హోమ్‌బలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. సుమ

కీర్తి సురేశ్‌.. పేరుకు తగ్గట్టుగానే నటిగా పేరు, పరపతిని పెంచుకుంటూ పోతున్నారు. ఆదిలోనే ఉత్తమ నటిగా జాతీయ ఉత్తమ అవార్డు గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. తమిళం, మలయాళం, తెలుగు భాషలను అధిగమించి హిందీ చిత్ర సీమలోనూ మకాం పెట్టారు. ఇటీవల ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం దసరా మంచి విజయాన్ని సాధించింది. అదేవిధంగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన మామన్నన్‌ చిత్రం కూడా మంచి సక్సెస్‌ సాధించింది.

కీర్తి సురేశ్‌ నాయకిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో రఘుతాతా ఒకటి. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేజీఎఫ్‌, సలార్‌ వంటి సంచలన చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. సుమన్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది.

త్వరలో రఘుతాతా చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీని గురించి కీర్తీసురేశ్‌ తన ఎక్స్‌ మీడియాలో పేర్కొన్నారు. 'ఆహా బయలుదేరిందయ్యా.. బయలుదేరింది. వినోదాల విందులతో రఘుతాతా త్వరలో థియేటర్లలోకి రానుంది' అని పేర్కొన్నారు. ఇది పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రం అని హీరోయినే స్వయంగా చెప్తున్నారన్నమాట. కాగా ఇంతకుముందు అభినయంతో ఆ తరువాత అందంతో అలరించిన ఈ భామ తాజాగా వినోదంతో ఆకట్టుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

చదవండి: 

Advertisement
 
Advertisement
Advertisement