శ్రీలీల కాదు ఆ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్? | Keerthy Suresh In Talks With Ajith's Good Bad Ugly Movie | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: ఆ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్

Jun 1 2024 10:50 AM | Updated on Jun 1 2024 10:58 AM

Keerthy Suresh In Talks With Ajith's Good Bad Ugly Movie

తమిళ స్టార్ హీరో అజిత్‌ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 'విడాముయర్చి' షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో రిలీజ్ తేదీపై ప్రకటన ఇవ్వనున్నారు. మరోవైపు తెలుగు బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచేసిందని చెప్పొచ్చు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

(ఇదీ చదవండి: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ రివ్యూ)

షూటింగ్‌ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమై, తొలి షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకుంది. ఇందులో హీరోయిన్‌గా తొలుత శ్రీలీల పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేసులో కీర్తి సురేశ్ నటించబోతుందని అంటున్నారు. మరి ఇద్దరు హీరోయిన్లకు చోటుందా? లేదా కీర్తి సురేశ్‌నే తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే కీర్తీసురేశ్‌ ఖాతాలో మరో భారీ చిత్రం పడినట్లే.

(ఇదీ చదవండి: 'భజే వాయువేగం' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement