The Delhi Files: The Kashmir Files Director Vivek Agnihotri Announces His Next Movie - Sakshi
Sakshi News home page

Vivek Agnihotri: 'ది కశ్మీర్‌ ఫైల్స్' డైరెక్టర్‌ వివేక్ తర్వాతి చిత్రం ఇదే..

Apr 15 2022 4:29 PM | Updated on Apr 15 2022 5:24 PM

The Kashmir Files Director Vivek Agnihotri  Announces The Delhi Files - Sakshi

1990లో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందిందిన సినిమా 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. ఈ చిత్రంలో బాలీవుడ్‌ దిగ్గజ నటులు అనుపమ్‌ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

The Kashmir Files Director Vivek Agnihotri  Announces The Delhi Files: 1990లో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందిందిన సినిమా 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. ఈ చిత్రంలో బాలీవుడ్‌ దిగ్గజ నటులు అనుపమ్‌ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పలు ప్రభుత్వాలు వినోదపు పన్నును సైతం మినహాయింపుని ఇచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కేవలం మౌత్‌ టాక్‌తోనే సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు వివేక్ రంజన్‌ అగ్నిహోత్రి దర్సకత్వం వహించిన విషయం తెలిసిందే. 
 


చదవండి: డైరెక్టర్‌ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

సామాజిక అంశాలను తన సినిమాలతో వేలెత్తి చూపే బాలీవుడ్‌ దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఆయన ఇదివరకు 'ది తాష్కెంట్‌ ఫైల్స్‌' అనే సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టారు. ఇక ఇటీవల వచ్చిన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రంతో మరో విజయం సాధించారు. దీంతో ఆయన నెక్ట్స్‌ మూవీ ఏంటి ? అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి తెరదింపుతూ తన కొత్త సినిమా గురించి అప్‌డేట్‌ ఇచ్చారు డైరెక్టర్‌ అగ్రిహోత్రి. ఆయన 'ది ఢిల్లీ ఫైల్స్‌' అనే  చిత్రం తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమా చిత్రీకరణకు ముందే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement