Karthikeya 2 Movie One Week Box Office Collections World Wide, Deets Inside - Sakshi
Sakshi News home page

Karthikeya 2 Movie Collections: బాలీవుడ్‌కు షాకిస్తున్న కార్తికేయ 2 వసూళ్లు

Aug 20 2022 6:13 PM | Updated on Aug 20 2022 6:35 PM

Karthikeya 2 One Week Box Office Collections - Sakshi

కేవలం 50 థియేటర్లతో మొదలైన ఈ చిత్రం ఇప్పుడక్కడ మూడు వేలకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే మామూలు విషయం కాదు. ఆమిర్‌ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చడ్డా, అక్షయ్‌ కుమార్‌ రక్షా బంధ

దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర.. అప్పుడెప్పుడూ జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. దీన్ని కొంచెం అటూఇటుగా మార్చి దండయాత్ర.. ఇది బాలీవుడ్‌ మీద దండయాత్ర.. చెప్పుకోవాల్సి వస్తోందిప్పుడు. అలా ఉంది సౌత్‌ జోరు. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పెద్ద సినిమాలు హిందీ బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించాయి. ఇటీవలే వచ్చిన మీడియం రేంజ్‌ మూవీ కార్తికేయ 2 కూడా బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తుండటం విశేషం.

కేవలం 50 థియేటర్లతో మొదలైన ఈ చిత్రం ఇప్పుడక్కడ మూడు వేలకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే మామూలు విషయం కాదు. ఆమిర్‌ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చడ్డా, అక్షయ్‌ కుమార్‌ రక్షా బంధన్‌ సినిమాలకు ఆదరణ లేకపోవడంతో థియేటర్‌ నిర్వాహకులు ఈ పెద్ద సినిమాలు తీసేసి కార్తికేయ 2ను రన్‌ చేస్తున్నారు. మొత్తంగా వారం రోజులు గడిచేసరికి ఈ మూవీ రూ.60.12 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. కృష్ణాష్టమిని ఈ చిత్రం బాగానే క్యాష్‌ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. ఆగస్టు 13న రిలీజైన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటించగా చందూ మొండేటి దర్శకత్వం వహించాడు.

చదవండి: హీరో వరుణ్‌తేజ్‌తో రిలేషన్‌.. నోరు విప్పిన అందాల రాక్షసి
అన్ని వారాల తర్వాతే ఓటీటీలోకి రానున్న లైగర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement