గీతా ఆర్ట్స్‌ బ్యానర్లో తెలుగులోకి కన్నడ బ్లాక్‌బస్టర్‌ ‘కాంతారా’, ఆసక్తిగా ట్రైలర్‌ | Kannada Actor Rishab Shetty Kantara Telugu Trailer Release | Sakshi
Sakshi News home page

Kantara Telugu Trailer: గీతా ఆర్ట్స్‌ బ్యానర్లో తెలుగులోకి కన్నడ బ్లాక్‌బస్టర్‌ ‘కాంతారా’, ఆసక్తిగా ట్రైలర్‌

Published Mon, Oct 10 2022 11:23 AM | Last Updated on Mon, Oct 10 2022 11:24 AM

Kannada Actor Rishab Shetty Kantara Telugu Trailer Release - Sakshi

కన్నడ దర్శక-నటుడు, రచయిత రిషబ్‌ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతారా’. ‘కేజీఎఫ్‌’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 30న రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ‘కాంతారా’ సినిమాను ఇతర భాషల్లోకి కూడా అనువదించి, రిలీజ్‌ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ సంస్థ అధినేత అల్లు అరవింద్‌ ‘కాంతారా’ తెలుగు థియేట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను దక్కించుకున్నారు. 

చదవండి: మనోజ్‌ సెకండ్‌ మ్యారేజ్‌పై మంచు లక్ష్మి షాకింగ్‌ రియాక్షన్‌

కాగా గీతా ఫిలింస్‌ బ్యానర్‌ ద్వారా తెలుగులో ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ‘ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడట. అతను ఏదో ఒక రాయి కోసం విశాలమైన భూమిని తన ఊరివాళ్లకు ఇచ్చేశాడట’, ‘ధైర్యం.. ధైర్యం ఉండేది నీలో ఉన్న ఆవేశంలోనే.. కానీ నీలో ఉన్న ఆవేశం నీకు శత్రువు కాకూడదు’ అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement