గ్రేటర్‌ ఫలితాలపై కంగనా ట్వీట్‌.. కాంగ్రెస్‌కు చురకలు

Kangana Ranaut Tweet On GHMC Election Results And Slams Congress - Sakshi

మీరు నా భజన చేస్తూ కాలం గడిపేస్తుంటే..

ముంబై: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ట్వీట్‌ చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇప్పటి వరకు 40 స్థానాలు గెలిచింది. కాగా కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో కంగనా కాంగ్రెస్‌ పార్టీపై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ప్రియమైన కాంగ్రెస్‌.. మీ పార్టీ అధికారంలో పలు రాష్ట్రాల్లో కంగనా కంగనా అంటూ నా నామం జపం చేస్తూ గందరగోళం చేస్తుంటే.. బీజేపీ మాత్రం తన పాలనతో క్లిష్టమైన నగరాల్లో ప్రజల హృదయాలను గెలుచుకుంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది’ అంటూ కంగనా కాంగ్రెస్‌ పార్టీకి  చురకలంటించారు. (చదవండి: వివాదాస్పద ట్వీట్‌‌.. కంగనకు నోటీసులు)

కాగా ఉత్కంఠ రేకెత్తిస్తోన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించగా.. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ మెల్లిమెల్లిగా పుంజుకుంటూ ఆధిక్యంలోకి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌-53 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 41 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక  కాంగ్రెస్‌ పార్టీ  మాత్రం కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఎంఐఎం 38 డివిజన్లలో విజయం సాధించింది. (చదవండి: కంగనా ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి... లేదంటే!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top