టైమ్‌ ట్రావెల్‌ చేయనున్న 'బింబిసార'.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Kalyan Ram Bimbisara Movie Theatrical Release Date Announced | Sakshi
Sakshi News home page

Bimbisara Movie: టైమ్‌ ట్రావెల్‌ చేయనున్న 'బింబిసార'.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Sun, Apr 3 2022 1:34 PM | Last Updated on Sun, Apr 3 2022 3:04 PM

Kalyan Ram Bimbisara Movie Theatrical Release Date Announced - Sakshi

Kalyan Ram Bimbisara Movie Theatrical Release Date Announced: నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వస్తున్న 18వ చిత‍్రం 'బింబిసార'. కేథరిన్‌, సంయుక్త మీనన్‌, వారీనా హుసేన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు విశిష్ట్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష‍్ణ. కె నిర‍్మిస్తున్న ఈ  సినిమాకు 'ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌' అనేది ట్యాగ్‌లైన్‌. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్‌. ఈ సంవత్సరం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా శనివారం సినిమా అధికారిక రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను విడదల చేశారు. 
 


సామాజిక మాధ్యమాల ద్వారా రిలీజైన ఈ పోస్టర్‌లో కల్యాణ్‌ రామ్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు. కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాలో అత్యున్నత సాంకేతికతను ఉపయోగించాం. ఇందులో కల్యాణ్ రామ్‌ రెండు విభిన్న పాత్రల్లో కనువిందు చేయనున్నారు. అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ సినిమాకు చిరంతన్ భట్‌ సంగీతం అందిస్తున్నారు. క్రీస్తూ పూర్వ ఐదో శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు కథతో ఈ మూవీ తెరకెక్కనుంది. టైమ్‌ ట్రావెల్‌ మూవీగా వస్తున్న 'బింబిసార'లో బింబిసారుడిగా, నేటితరం యువకుడిగా రామ్‌ నటిస్తున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement