Fact Check: RRR Movie | Did Alia Bhatt Unfollow SS Rajamouli And Delete RRR Posts On Instagram? - Sakshi
Sakshi News home page

Alia Bhatt-Rajamouli: ఆర్‌ఆర్‌ఆర్‌ను పట్టించుకోని ఆలియా? ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో క్లారిటీ!

Mar 30 2022 1:04 PM | Updated on Mar 30 2022 2:18 PM

Fact Check: Did Alia Bhatt Unfollow SS Rajamouli And Delete RRR Posts On Instagram? - Sakshi

రాజమౌళిపై ఆమె అలక పూనిందా? లేదా? అన్న విషయం పక్కనపెడితే ఆమె జక్కన్నను అన్‌ఫాలో చేయలేదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 474 మందిని ఫాలో అవుతుండగా అందులో రాజమౌళి కూడా ఉన్నాడు. దీంతో ఈ హీరోయిన్‌ తెలుగు దర్శకుడిని పక్కన పెట్టిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టమవుతోంది.

RRR Movie: యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. తారక్‌, చెర్రీల నటనకు మంత్రముగ్ధులవుతున్నారు ఫ్యాన్స్‌. ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్‌, చరణ్‌కు జంటగా ఆలియాభట్‌ నటించిన విషయం తెలిసిందే! కానీ వీరి పాత్రల నిడివి కొంత తక్కువేనని చెప్పుకోవాలి. అయితే తనకు తక్కువ స్క్రీన్‌స్పేస్‌ లభించడంపై ఆలియా అసంతృప్తిగా ఉందని, ఈ క్రమంలో రాజమౌళిని అన్‌ఫాలో కూడా చేసిందంటూ వార్తలు ఊపందుకున్నాయి.

నిజంగానే ఆమె రాజమౌళిపై అలకబూనిందా? లేదా? అన్న విషయం పక్కనపెడితే అసలు ఆలియా జక్కన్నను అన్‌ఫాలో చేయనేలేదు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో దాదాపు 475 మందిని ఫాలో అవుతుండగా అందులో రాజమౌళి కూడా ఉన్నాడు. దీంతో ఈ హీరోయిన్‌ తెలుగు దర్శకుడిని పక్కన పెట్టిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టమవుతోంది. ఇక హిందీలో రూ.100 కోట్లు కొల్లగొట్టిన విషయాన్ని సైతం ఆలియా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ చిత్రయూనిట్‌తో తనకు ఎలాంటి విబేధాల్లేవని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్‌ మీద విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఒక్క హిందీలోనే రూ.100 కోట్లు రాబట్టడం విశేషం. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గణ్‌ సైతం ఓ ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే!

చదవండి: RRR Movie : సినిమా కథ మొదలయ్యేది ఈమెతోనే.. ఇంతకీ మల్లి ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement