ఎ‍స్తర్‌ ప్రకటన.. రెండో పెళ్లి గురించేనా? | Ester Noronha Announcement; Will Get Second Marriage? | Sakshi
Sakshi News home page

ఎ‍స్తర్‌ ప్రకటన.. రెండో పెళ్లి గురించేనా?

Sep 13 2025 11:15 AM | Updated on Sep 13 2025 12:47 PM

Ester Noronha Announcement; Will Get Second Marriage?

సినీ నటి ఎ‍స్తర్‌ నోరోన్హ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఒక ఫోటోను షేర్‌ చేసి త్వరలో శుభవార్త చెబుతానంటూ పంచుకుంది. దీంతో అభిమానులు కూడా పెళ్లి గురించే ఉంటుంది అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.

తెలుగులో 'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఎ‍స్తర్‌ నోరోన్హ. ఆమె ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. జయ జానకి నాయిక, గరం,69 సంస్కార్‌ కాలనీ,డెవిల్,టనెంట్‌ వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో కూడా మెప్పించిన ఎస్తర్‌ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గతంలో తెలిపింది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్లేనని తెలుస్తోంది.

కొత్త ప్రకటన అంటూ ఒక ఫోటోతో ఎస్తర్‌ ఇలా పంచుకుంది. 'జీవితంలో నాకు మరో అందమైన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. అవకాశాలతో పాటు ఎన్నో అద్భుతాలను ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పుట్టినరోజున నాపై మీ అందరూ ప్రేమతో ఆశీర్వాదాలను కురిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మీతో ఒక "ప్రత్యేక ప్రకటన" పంచుకోబుతున్నాను. త్వరలోనే ప్రకటిస్తాను. దయచేసి వేచి ఉండండి.' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఆమె రెండో పెళ్లి గురించి చెబుతుందని ఆందరూ ఆశిస్తున్నారు.

రెండో పెళ్లి గురించి గతంలో ఎస్తర్ఏం చెప్పిందంటే..
టాలీవుడ్‌ సింగర్‌, నటుడు నోయల్‌ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్న ఎస్తర్‌.. వారి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్‌ తన గ్లామర్‌తో కుర్రకారును అదరగొట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఎస్తర్‌ ఇలా చెప్పుకొచ్చింది. 'నేను 2019లో పెళ్లి చేసుకున్నాను. అయితే, మేము కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నాము. పెళ్లయిన 16 రోజుల తర్వాత అతనితో దూరంగానే ఉంటూ వచ్చాను. 

అలా 2020లో విడాకులు తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ఒంటరిగా బతకాలని లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. నాకు అందమైన జీవితం కావాలి. అందుకు తగిన భాగస్వామి కోసం వెతుకుతున్నాను. అయితే, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో నాకు క్లారిటీ లేదు. నేను ఇప్పటికే ఒకసారి వివాహం చేసుకున్నాను.. అందులో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను, నన్ను అర్థం చేసుకునే అబ్బాయి నాకు దొరుకుతే సంతోషం. షోకేస్ లాంటి భర్త వద్దు.' అని ఎస్తర్‌ చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement