
Chiranjeevi Recovers From Covid-19 And Back To Work: మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హోం క్వారంటైన్‌లో చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా కోవిడ్ నెగిటివ్ రావడంతో మళ్లీ తిరిగి షూటింగులకు హాజరయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరించారు.
'బ్యాక్ టూ వర్క్ అండ్ బ్యాక్ ఇన్ యాక్షన్' అంటూ సినిమా సెట్స్‌లో పాల్గొన్న ఫోటోలకు షేర్ చేశారు. ఇక తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.