వాఘా సరిహద్దు వద్ద అజిత్‌.. ఫోటోలు షేర్‌ చేసిన బోనీ కపూర్‌

Boney Kapoor Shares Bike Raiding Pics of Tamil Actor Ajith - Sakshi

తమిళంతో పాటు తెలుగులో ‘తల’ అజిత్‌ కుమార్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి చెప్పనక్కర్లేదు. ఈయన సినిమా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఈయనకి నటనే కాకుండా షూటింగ్‌, బైక్‌ రైడింగ్‌ అంటే ఎంతో ఇష్టం. అందుకే సమయం చిక్కినప్పుడల్లా బైక్‌పై యాత్రలు చేస్తూ ఉంటాడు ఈ స్టార్‌. 

హెచ్ వినోద్‌ దర్శకత్వంలో బోనీ కపూర్‌ నిర్మాణంలో అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వాలిమై’. ఈ సినిమా షూటింగ్‌ రష్యాలో జరుగుతున్న టైమ్‌లోనూ ఇలాంటి టూర్స్‌కి వెళ్లొచ్చాడు ఈ హీరో. అయితే తాజాగా ఆ మూవీ షూటింగ్‌ గ్యాప్‌లో వాఘా సరిహద్దుకు వెళ్లాడు ఈ నటుడు. ఆయన గేటు ద‌గ్గ‌ర నిల్చుని మూడు రంగుల జెండా పట్టుకుని ఫొటోలకు ఫోజు ఇచ్చాడు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ చిత్ర నిర్మాత బోనీ క‌పూర్ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో అజిత్ సైనికుల‌తో క‌లిసి ఫొటోలు దిగాడు. దీంతో ఆయన తాజా చిత్రంలో ఈ హీరో బైక్ రేస‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జరుగుతోంది. దీంతో ఈ పిక్స్‌ వైరల్‌గా మారాయి.

చదవండి: బైక్‌పై ప్రపంచాన్ని చుట్టేస్తున్న స్టార్‌ హీరో.. పిక్స్‌ వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top