బాలీవుడ్‌లో మ్యారెజ్‌ ట్రెండ్‌.. పర్సనల్‌ లైఫ్‌పై ఫోకస్‌

Bollywood Star Heroines Focused On Personal Life - Sakshi

ఒకప్పుడు హీరోయిన్‌కు మ్యారేజ్‌ అంటే, కెరీర్‌ ముగిసినట్లే లెక్క. కానీ ఈ తరం బాలీవుడ్‌ హీరోయిన్స్‌ తీరు వేరు. కెరీర్‌ని పక్కన పెట్టి మరీ, పర్సనల్‌ లైఫ్‌కు ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు. కెరీర్ కోసం మ్యారేజ్ ను పోస్ట్ పోన్ చేయడం ఈ జనరేషన్ హీరోయిన్స్ కు నచ్చడం లేదు. అందుకే స్టార్ డమ్ కోసం పరుగులు తీయకుండా మ్యారేజ్ లైఫ్ కోసం పోటీ పడుతున్నారు.ఎంత వేగంగా ప్రేమ చిగురిస్తోందో అంతే వేగంగా ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్తోంది.

కరీనా కపూర్, అనుష్క శర్మా, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణె, కత్రీనా, ఆలియా భట్ వీరందరూ బాలీవుడ్ లీడింగ్ లేడీస్. స్టార్ హీరోస్ కు పర్ఫెక్ట్ జోడీస్.కాని కెరీర్ మధ్యలో ఎప్పుడైతే ప్రేమ పుట్టుకొస్తుందో ఆ వెంటనే వీరి మూడ్ మారిపోతోంది. పెళ్లి వైపు వీరి ఆలోచనలు సాగిపోతున్నాయి. ఒకరు తర్వాత ఒకరు పెళ్లిల్లు చేసుకుంటూ అత్తారింటికి వెళ్లేందుకు పోటీపడుతున్నారు. రీజన్ ఏదైనా సరే స్టార్ హీరోయిన్స్ మ్యారేజ్ ట్రెండ్ మాత్రం బాలీవుడ్ ను కొత్తగా చూపిస్తోంది. హిందీ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని సిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
(చదవండి: త్వరలో పెళ్లి చేసుకోనున్న కేఎల్‌ రాహుల్-అతియా శెట్టి !)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top