బిగ్‌బాస్‌: తొలివారం ఎలిమినేట్‌ అయ్యేది అతనే!

Bigg Boss Telugu 4 Surya Kiran Would Be The First Eliminated - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 మొదలై వారం కావొస్తున్న అనుకున్నంత ఆదరణ లభించడం లేదనిపిస్తోంది. బలమైన, పేరున్న కంటెస్టెంట్లను తీసుకురావడంలో బిగ్‌బాస్‌ ఈసారి దృష్టి పెట్టలేదనేది ప్రేక్షకుల మాట. ఈక్రమంలోనే తొలి వారం ఎలిమినేషన్‌కు గడువు దగ్గర పడింది. హౌజ్‌ నుంచి ఎవరు బయటికి వెళ్తారనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది. అయితే, శనివారం నాటి ఎపిసోడ్‌ను బట్టి సూర్య కిరణ్‌ ఎలిమినేషన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన ప్రవర్తనపై ఇంటా, బయటా విమర్శలు వస్తున్నాయి. ప్రేక్షకుల్లో కూడా ఆయనపై మంచి అభిప్రాయం కలగలేదని సోషల్‌ మీడియాలో కామెంట్లను బట్టి అర్థమవుతోంది. అతన్ని బయటికి పంపించేందు ఓట్లు వేసినట్టు చాలా మంది చెప్తున్నారు. ఇక హోస్ట్‌ నాగార్జున సైతం సూర్య కిరణ్‌ను కాస్త కఠినంగానే మందలించారు. అన్నీ కలగలిసి అతన్ని బయటికి పంపేందుకు రంగం సిద్ధమయ్యేలా చేశాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
(చదవండి: బిగ్‌బాస్‌ : గంగవ్వ తోపు.. ‘బకరా’ అయిన లాస్య)

డ్యాన్సులతో ఇరదీసిన కంటెస్టెంట్లు
ఇక ‘సండే అంటే ఫన్‌ డే’ అంటూ రాములో రాములా పాటతో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. హౌజ్‌లోని కంటెస్టెంట్లతో సైతం ఆయన డ్యాన్సులు వేయించాడు. దివి వైద్య-సొహైల్‌, హారిక-నోయల్‌, దేవి-అభిజిత్‌, లాస్య-సూర్యకిరణ్‌, మోనాల్‌-మెహబూబ్‌ జోడీగా స్టెప్పులు వేశారు. ‘తమ్ముడూ.. లెట్స్‌ డూ కుమ్ముడూ’ పాటకు అమ్మ రాజశేఖర్‌ గంగవ్వతో కాలు కదిపాడు. అంతకుముందు నాగార్జున కంటెస్టెంట్లను బొమ్మలు గీయాలని చెప్పాడు. కంటెస్టెంట్లు వేసిన బొమ్మలను మిగతావారు వర్ణించాలని సూచించాడు. ఆదివారం ఉదయం విడుదలైన ప్రోమో ద్వారా ఈ విషయాలు రివీల్‌ అయ్యాయి. ఇదిలాఉండగా.. ఈ రోజుల్లో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో ఆదివారం నాటి ఎపిసోడ్‌ ద్వారా హౌజ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి.
(చదవండి: టాప్ 5లో ఎవ‌రుంటార‌ని చెప్ప‌డం క‌ష్టం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top