షూటింగ్‌ స్పాట్‌లో బాలయ్యకు గాయం..షూట్‌ తర్వాత హాస్పిటల్‌కి.. | Balakrishna Injured In AHA Talk Show Shooting Sets | Sakshi
Sakshi News home page

Balakrishna : షూటింగ్‌ స్పాట్‌లో బాలకృష్ణకు గాయం!..అయినా షూట్‌ కంటిన్యూ

Oct 9 2021 3:39 PM | Updated on Oct 9 2021 6:10 PM

Balakrishna Injured In AHA Talk Show Shooting Sets - Sakshi

Balakrishna Injured In AHA Talk Show Shooting Sets: షూటింగ్‌ చేస్తుండగా బాలకృష్ణ కాలికి గాయమైనట్లు సమాచారం. 

Balakrishna Injured In AHA Talk Show Shooting Sets : నందమూరి బాలకృష్ణ కాలికి గాయమైనట్లు సమాచారం. అయితే కాలికి దెబ్బ తగిలినా షూటింగ్‌ను పూర్తిచేశారట. కాగా ప్రస్తుతం బాలయ్య ఆహాలో ప్రసారం కానున్న ఓ టాక్‌ షోకి హోస్ట్‌ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో దీనికి సంబంధించిన ప్రోమో షూట్‌ జరిగిందట. అయితే షూటింగ్‌ సమయంలో బాలయ్య కాలుకు చిన్న గాయం అయినట్లు తెలుస్తుంది. అయినా లెక్కచేయకుండా షూటింగ్‌ను పూర్తిచేశారట. చదవండి: జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ

ఆ తర్వాత హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్న ఈ షోకు  అన్‌స్టాప‌బుల్ అనే టైటిల్ ప‌రిశీలిస్తుండ‌గా, తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా మంచు మోహాన్‌బాబు ఫ్యామిలీ హాజరు కానున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తి చేవారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్‌ తర్వాత సమంత ఆ నిర్ణయం తీసుకుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement