అంతర్జాతీయ పురస్కార బలగం

Balagam Wins Best Feature Film, Best Cinematography Awards At LACA - Sakshi

హాస్య నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా నటించారు. ‘దిల్‌’ రాజు సారథ్యంలో శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదలై, మంచి విజయం సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది.

లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో ఈ చిత్రం బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీతోపాటు బెస్ట్‌ సినిమాటోగ్రఫీ అవార్డులకు ఎంపికైన విషయాన్ని చిత్రదర్శకుడు వేణు వెల్లడించారు. ‘నా బలగం’కు ఇది మూడో అవార్డు. ప్రపంచ వేదికపై బలగం మెరుస్తోంది’’ అన్నారు. ఈ అవార్డును ఛాయాగ్రాహకుడు ఆచార్య వేణు, దర్శకుడు వేణు అందుకోనున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top