Avatar: The Way of Water Official Teaser Trailer Released - Sakshi
Sakshi News home page

Avatar 2 Teaser: 'అవతార్‌ 2' టీజర్‌ వచ్చేసింది.. చూశారా !

Published Mon, May 9 2022 9:30 PM

Avatar The Way Of Water Teaser Trailer Released - Sakshi

Avatar The Way Of Water Teaser Released: ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'అవతార్​ 2'. 2009లో హాలీవుడ్​ లెజండరీ డైరెక్టర్​ జేమ్స్​ కామెరాన్​ సృష్టించిన గొప్ప విజువల్​ వండర్​ 'అవతార్'​. దీనికి సీక్వెల్‌గా వస్తున్న మూవీ  'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్'. ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను మే 6న 'డాక్టర్​ స్ట్రేంజ్:​ ఇన్​ ది మల్టీవర్స్​ ఆఫ్​ మ్యాడ్​నెస్'​ సినిమా ప్రదర్శించే థియేటర్లలో విడుదల చేశారు. 

'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్' టీజర్‌ను తాజాగా సోషల్‌ మీడియాలో సోమవారం (మే 9) రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్‌తో ప్రారంభం కాగా, అందులోని అద్భుతమైన లొకేషన్లు, మైమరిపించే నీలి సముద్రం అబ్బురపరిచేలా ఉన్నాయి. టీజర్‌ ఆసక్తిగా ఉన్నా సినిమా కథేంటి అనేది సస్పెన్స్‌గానే ఉంది. కాగా ఈ సినిమా డిసెంబర్‌ 16న విడుదలకు సిద్ధంగా ఉండగా, 2024లో అవతార్‌ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్‌ 5 సినిమాలు రిలీజ్ ‍కానున్నాయి. 

చదవండి: ఇదెక్కడి మాస్‌ రిలీజ్‌ జేమ్స్‌ మావా.. అన్ని భాషల్లో 'అవతార్‌ 2' సినిమా !
Advertisement
 
Advertisement
 
Advertisement