
అక్టోబరులో అమితాబ్ బచ్చన్ ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్)పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్, ఓ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్‌లో ఓ వారం రోజులు అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు.
మళ్లీ అక్టోబరులో ఆయన హైదరాబాద్ ఆ రహా హై (వస్తున్నారు). అక్టోబరులో ప్రారంభమయ్యే భారీ షెడ్యూల్‌లో అమితాబ్ బచ్చన్ నెలరోజులకుపైనే పాల్గొంటారు. ప్రభాస్, అమితాబ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్‌లోనే దీపికా కూడా జాయిన్ అవుతారు. అంతేకాదు.. ఈ ప్యాన్ ఇండియన్ మూవీలో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా కొందరు ప్రముఖ హీరోలు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారట. ఆ హీరోలు ఎవరు? అనేది వేచి చూడాలి.