పనిలో బచ్చన్‌ ఫ్యామిలీ.. దొంగచాటుగా సెల్ఫీ

Amitabh Bachchan Secret Selfie With Wife And Daughter At Work - Sakshi

ముంబై: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు కుటుంబంతో సరదగా గడిపిన క్షణాలను, సామాజిక విషయాలను షేర్‌ చేస్తుంటారు. తాజాగా బిగ్‌బీ భార్య జయబచ్చన్‌, కూతురు శ్వేతా బచ్చన్‌తో సీక్రెట్‌గా తీసుకున్న సెల్ఫీని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫొటోకు బిగ్‌బీ ‘పనిలో ఉన్న కుటుంబం’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. అయితే ఇది షూటింగ్‌ సెట్‌లో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. (చదవండి: నా ప్రేమ వందనాలు స్వీకరించు ప్రియా)

ఈ ఫొటోలో అందరూ సంప్రాదాయ దుస్తులు ధరించి ఉన్నారు. షూటింగ్‌ విరామ సమయంలో బిగ్‌బీ దొంగచాటుగా ఈ సెల్ఫీ తీసినట్లు తెలుస్తోంది. కాగా అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ టీవీ షో కౌన్‌ బనేగా కరోడ్‌ పతి సీజన్‌ 12 ప్రారంభమైంది. దీంతో బిగ్‌బీ కేబీసీ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్‌బీ లవ్‌బర్డ్స్‌ రణబీర్‌ కపూర్‌, అలియాలు జంటగా నటిస్తున్న ‘బ్రహ్మస్త్ర’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు అజయ్‌ దేవగన్‌తో కలిసి ‘జుండ్‌’, ‘చెహర్’లతో పాటు బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె, బాహుబలి ప్రభాస్‌ జంటగా తెరకెక్కబోయే చిత్రం ‘ఆదిపురుష్‌’లో బిగ్‌బీ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top