రికార్డు సృష్టిస్తోన్న బన్నీ ‘పుష్ప’ ఇంట్రడక్షన్ వీడియో!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలై టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు పప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి. ఇక అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా పుష్ప ఇంట్రడక్షన్ వీడియో విడుదల కాగా, ఇది రికార్డు సృష్టిస్తోంది. కాగా ఈ మూవీలో లీడ్‌రోల్ పుష్ప రాజ్ పాత్రను పరిచయం చేస్తూ బన్ని బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఇంట్రడక్షన్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.
తాజాగా ఈ వీడియోను తెలుగు ఇండస్ట్రీలోనే 70 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతూ.. తొలి ఇంట్రడక్షన్ వీడియోగా తెలుగు సినీ చరిత్రలోనే రికార్డు సృష్టించింది. కేవలం టీజర్‌తోనే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బన్నీ ఇక సినిమా విడుదలయ్యాంక ఇంకెంత ప్రభంజనం సృష్టించనున్నాడో వేచి చూడాలి. కాగా ఇందులో బన్ని సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ నడుటు ఫహాద్ ఫాసిల్ మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
చదవండి:
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా ‘పుష్ప’