Alia Bhatt: సౌత్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు: అలియా భట్

Alia Bhatt On South Industry Says Even All Their Films Not Worked - Sakshi

Alia Bhatt On South Industry Says Even All Their Films Not Worked: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కమిట్‌ అయిన సినిమాలకు ప్రెగ్నెన్సీలోనూ ప్రమోషన్స్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల అలియా హాలీవుడ్ డెబ్యూ చిత్రం 'హార్ట్‌ ఆఫ్ ‍స్టోన్‌' చిత్రీకరణలో పాల్గొంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన మూవీ డార్లింగ్స్‌ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

''భారతీయ చిత్రపరిశ్రమ మొత్తానికి ఇది కష్టకాలం. ఇలాంటి పరిస్థితుల్లో మనం హిందీ చిత్రాలపై కాస్త దయ చూపించాలి. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఆహా బాలీవుడ్‌.. ఓహో హిందీ సినిమాలు అని చెప్పుకుంటున్నాం. కానీ ఇటీవల విడుదలైన ఎన్ని బాలీవుడ్ చిత్రాలు మంచి విజయం సాధించాయి ? సౌత్‌ ఇండస్ట్రీలో కూడా అన్ని సినిమాలు బాగా ఆడలేదు. అక్కడ కూడా మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలే విజయం సాధిస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా. అంతెందుకు నా సినిమా 'గుంగూభాయి కతియావాడి'నే తీసుకోండి. అది మంచి విజయాన్నే సొంతం చేసుకుంది కదా'' అని ఓ ఇంటర్వ్యూలో అలియా భట్‌ పేర్కొంది.

అలాగే ప్రెగ్నెన్సీ సమయంలోనూ ప్రమోషన్స్‌లో పాల్గొనడంపై అడిగిన ప్రశ్నకు 'ఇలాంటి సమయంలో రెస్ట్‌ తీసుకోకుండా ప్రమోషన్స్‌లో పాల్గొనడం ఇబ్బందిగా లేదా? అని చాలామంది అంటున్నారు. నిజానికి, మనం సంపూర్ణ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్న కూడా పని నుంచి విరామం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే ఉత్సాహాంతో పని చేసుకోవచ్చు. నాకు వృత్తిపట్ల ఉన్న ప్రేమ, అంకితభావంతోనే ఇలా చేయగలుగుతున్నా' అని చెప్పుకొచ్చిందీ క్యూట్‌ హీరోయిన్‌. కాగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో అలియా భట్‌ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top