Akkineni Nagarjuna Clarity On Political Entry In Upcoming Elections In AP - Sakshi
Sakshi News home page

Nagarjuna On Political Entry: ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు: నాగార‍్జున

Sep 30 2022 5:14 PM | Updated on Sep 30 2022 8:29 PM

Akkineni Nagarjuna Clarity On Political Entry In Upcoming Elections In AP - Sakshi

అక్కినేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలపై టాలీవుడ్ కింగ్ స్పందించారు. తనకు ఎలక్షన్లలో పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి నాపై ఇలాంటి ప్రచారం జరుగుతోందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు నాగార్జున.   

(చదవండి: 'ది ఘోస్ట్‌' ట్రైలర్ రిలీజ్‌.. కింగ్ యాక్షన్‌కు ఫిదా అవ్వాల్సిందే)

నాగార్జున మాట్లాడుతూ 'నేను వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎలక్షన్ల సమయంలో ప్రతిసారి ఇలాంటి ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా. మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్‌గా నటిస్తా' అని వివరణ ఇచ్చారు. కాగా.. నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' దసరాకు థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement