Aishwarya Rai : 'అలాంటి అవకాశం నా కూతురికి రావడం చాలా సంతోషం'

అందాల తార ఐశ్వర్య రాయ్ నటించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ అందాల యువరాణి నందిని పాత్రలో కనిపించనుంది.రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అనంతరం విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని ఆ అంచనాలను ఇంకా పెంచేశాయి.
ఈ సిరీస్‌లో మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఐశ్వర్య తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా కూతురు ఆరాధ్య ఓసారి సెట్స్‌కి వచ్చింది. ఒక పీరియాడికల్ డ్రామా మొదటి సారి చూడడంతో ఆమె చాలా ఎగ్జైట్ అయ్యింది. అదే సమయంలో మణిరత్నం సర్ పిలిచి మరీ ఆరాధ్యకి ఓ సీన్ కోసం కట్ చెప్పేందుకు అవకాశం ఇచ్చారు.
ఇప్పటివరకు అలాంటి అవకాశం మాలో ఎవరికీ రాలేదు. కానీ అది ఆరాధ్యకి దక్కింది. అందుకే సెట్‌లో అందరం ఆశ్చర్యపోయాం. నాకూ, నా కూతురికి అదొక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిపోతుంది' అంటూ ఐష్ చెప్పుకొచ్చింది.
The perfect choice 🔥 thanks #ManiRatnam 🙏♥️
Nandini Devi is coming on 30 sep 2022#AishwaryaRai#AishwaryaRaiBachchan #PonniyinSelvan #ps1 pic.twitter.com/BnnU7bTXtF— Nandini (@LiveLonly1) September 21, 2022
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు