‘ఆదిపురుష్‌’ వచ్చేది అప్పుడే..! | Adipurush Will Release On August 11 2022 | Sakshi
Sakshi News home page

ఆదిపురుష్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన చిత్ర బృందం

Nov 19 2020 8:14 AM | Updated on Nov 19 2020 8:22 AM

Adipurush Will Release On August 11 2022 - Sakshi

బాహుబలితో ప్రభాస్‌ దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నారు. డార్లింగ్‌కు సంబంధించిన ఏ విషయమైన తెగ ట్రెండ్‌ అవుతుంది. అలాంటిది ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌ వస్తే.. ఇక చెప్పేది ఏం ఉంది. అభిమానులకు పండగే. ప్రస్తుతం డార్లింగ్‌ అభిమానులు అందరు ‘రాధే శ్యామ్‌’, ‘ఆది పురుష్’‌ సినిమాలు ఎప్పుడు విడుదల‌ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘ఆది పురుష్‌’ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఆగస్టు 11, 2022న ఆదిపురుష్‌ విడుదల కానుందని తెలిపింది. ఈ మేరకు చిత్ర బృందం ట్వీట్‌ చేసింది. ఈ వార్తతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. (చదవండి: ఇటలీని షేక్‌ చేస్తున్న ప్రభాస్‌ మేనియా)

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆది పురుష్‌’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదో భారీ బడ్జెట్‌ ఫ్యాంటసీ చిత్రం. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు.  బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణాసురుడిగా కనిపించనున్నారు. భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్‌ ఆదిపురుష్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement