ఇటలీని షేక్‌ చేస్తున్న ప్రభాస్‌ మేనియా | Prabhas Photos From Radhe Shyam Going Viral On Social Media In Italy | Sakshi
Sakshi News home page

ఇటలీలో వైరలవుతున్న ప్రభాస్‌ ఫోటోలు

Nov 6 2020 3:49 PM | Updated on Nov 6 2020 5:23 PM

Pictures From Radhe Shyam Going Viral On Social Media In Italy - Sakshi

బాహుబలితో ఇండియా వ్యాఫ్తంగా ఎనలేని క్రేజ్‌ సంపాదించిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మేనియా ఇటలీలో గట్టిగానే కనిపిస్తుంది. రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ స్టిల్స్‌తో పాటు ప్రభాస్‌ దిగిన ఫోటోలు ఇప్పుడు అక్కడి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభాస్‌ సాహో సినిమా తర్వాత రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కొంతభాగం షూటింగ్‌ ఈ మధ్యనే ఇటలీలో జరిగింది.  అక్టోబర్‌ 24 ప్రభాస్‌ పుట్టినరోజు పురస్కరించుకొని చిత్రబృందం విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాలో ప్రభాస్‌, పూజా హెగ్డేల లుక్స్‌ స్టిన్నింగ్‌గా ఉంటూ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేశాయి.


షూటింగ్‌ సమయంలో ఆన్‌సెట్‌ లొకేషన్లతో పాటు ఆఫ్‌ లొకేషన్‌లో దిగిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కార్లను అమితంగా ఇష్టపడే ప్రభాస్‌.. షూటింగ్‌ సమయంలో మసరెటీ బీఎండబ్యూ కారు వద్ద దిగిన ఫోటోతో పాటు ప్రభాస్‌ రన్నింగ్‌ ట్రాక్‌ వేసుకొని ఇటలీ వీధుల్లో జాగింగ్‌ చేస్తూ అక్కడి తన లోకల్‌ ఫ్యాన్‌తో దిగిన ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతోపాటు రాధేశ్యామ్‌ చిత్రబృందాన్ని ఇటలీ మీడియా ఇంటర్య్వూ చేసిన సందర్భంగా దిగిన ఫోటోలను కూడా ట్విటర్‌లో షేర్‌ చేశారు. (చదవండి : ‘రాధేశ్యామ్‌’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?)

కాగా ఇటలీలో షూటింగ్‌ ముగించుకొని ఈ మధ్యనే తిరిగి ఇండియాకు వచ్చిన రాధేశ్యామ్‌ బృందం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినిమాకు సంబంధించిన చివరి పార్ట్‌ షూటింగ్‌ను కంప్లీట్‌ చేయనున్నారు. యూవీ క్రియేషన్స్‌, టి సిరీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫిక్షనల్ రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్‌ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ, ప్రియదర్శి, సచిన్‌ ఖేడ్కర్‌, కునాల్‌ రాయ్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement