Actress Meera Mithun Gets Into Another Controversy - Sakshi
Sakshi News home page

మరో వివాదంలో నటి మీరా మిథున్‌.. డైరెక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dec 14 2021 8:27 AM | Updated on Dec 14 2021 12:49 PM

Actress Meera Mithun Gets Into Another Controversy - Sakshi

నటి మీరా మిథున్‌ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఈమె కథానాయికగా నటించిన చిత్రం పేయ కానోమ్‌. గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తేని భారత్‌ ఆర్‌.సురుళివేల్‌ నిర్మిస్తున్న చిత్రం ఇది. మీరాతో పాటు నటుడు కౌశిక్, సంధ్య రామచంద్రన్, కోదండం, ఫైట్‌ మాస్టర్‌ జాగ్వార్‌ తంగం ప్రధాన పాత్రలు పోషించారు.


సెల్వ అన్భరసన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి చెన్నైలో నిర్వహించారు.దర్శకుడు మాట్లాడుతూ చిత్ర షూటింగ్‌ 80 శాతం పూర్తయిన తర్వాత మీరా మిథున్‌ను పోలీసులు అరెస్టు చేశారని, తర్వాత ఆమె జైలు నుంచి బయటకు రావడంతో మిగిలిన 20 శాతం షూటింగ్‌ను కొడైకెనాల్‌లో నిర్వహించామన్నారు.

అయితే 2రోజుల్లో షూటింగ్‌ పూర్తి అవుతుందనగా మీరా మిథున్‌ తనతో వచ్చిన ఆరుగురు వ్యక్తులతో కలసి ఎవరికీ చెప్పకుండా పారి పోయిందన్నారు. దీంతో ఆమె లేకుండానే కథను మార్చి చిత్రాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement