'గెలిచినందుకు కంగ్రాట్స్.. ఆ మాట తప్పకూడదు'.. విజయ్‌కు సత్యరాజ్ చురకలు | Actor Satyaraj Commnets On Vijay Win Tamilnadu Elections | Sakshi
Sakshi News home page

Satyaraj: 'డీఎంకే ఓటమి బాధించింది.. విజయ్‌ మాట తప్పరనుకుంటున్నా'

May 5 2026 6:25 PM | Updated on May 5 2026 6:33 PM

Actor Satyaraj Commnets On Vijay Win Tamilnadu Elections

తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయంపై నటుడు సత్యరాజు స్పందించారు. ఈ గెలుపు పట్ల విజయ్‌కు అభినందనలు తెలిపారు. అదే సందర్భంలో మీరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. మీరు పెరియార్, అంబేద్కర్‌ను తనకు ఆదర్శమని ప్రకటించారని గుర్తు చేశారు. మీరు వారి విలువలను నిలబెట్టి, సామాజిక న్యాయాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. డీఎంకే స్టాలిన్ ఓటమి పట్ల బాధగా ఉందన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో తన సపోర్ట్‌ డీఎంకేకే ఉంటుందని సత్యరాజ్ స్పష్టం చేశారు.

కాగా.. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే చీఫ్, హీరో విజయ్ ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు.  తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో నిలిచిన విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లు సాధించింది. ఇంకా అధికారం చేపట్టాలంటే మరో పది సీట్లు కావాలి. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. దీంతో సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement