Abhiram Daggubati Debut Film Ahimsa First Look Out, Pic Viral - Sakshi
Sakshi News home page

Abhiram Daggubati Ahimsa First Look: దగ్గుబాటి రానా తమ్ముడి ‘అహింస’.. ముఖానికి గోనె సంచి, నోటి నుంచి రక్తం!

Feb 22 2022 1:43 PM | Updated on Feb 22 2022 3:49 PM

Abhiram Daggubati Debut Film Ahimsa First Look Out - Sakshi

Rana Daggubati Brother Debut Movie First Look: దర్శకుడి తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్‌ కిరణ్‌, నితిన్‌, నవదీప్‌ లాంటి యంగ్‌ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్‌ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్‌ ఉండేది. పలువురు యంగ్‌ హీరో,హీరోయిన్లు తేజ దర్శకత్వంలో నటించాలని ఆశ పడేవారు. అయితే ఇటీవల కాలంలో తేజను వరుస ప్లాపులు పలకరించాయి.

చాలా కాలం తర్వాత రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’మూవీ తీసి హిట్‌ కొట్టాడు. అయితే ఈ విజయాన్ని అలాగే కొనసాగించడంతో తేజ విఫలం​ ఆయ్యాడు. ఆ మూవీ తర్వాత తేజ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో తేజ కాస్త విరామం తీసుకొని.. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరోని పరిచయం చేసేందుకు సిద్దమయ్యాడు. రానా తమ్ముడు అభిరామ్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తేజ. నేడు(ఫిబ్రవరి 22) తేజ బర్త్‌డే. ఈ సందర్భంగా  ఈ చిత్రంకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమాకి అహింస అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అభిరామ్ ముఖం కనిపించకుండా కళ్ళవరకూ గోనె సంచితో కట్టేసి ఉండగా.. అతడి నోటి నుంచి రక్తం కారుతూ ఉండే లుక్ ఆకట్టుకుంటోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement