మహేశ్‌ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌.. చైనాలో కూడా రిలీజ్! | Aamir Khan May Be Act In Rajamouli And Mahesh Babu Upcoming Movie | Sakshi
Sakshi News home page

మహేశ్‌ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌.. చైనాలో కూడా రిలీజ్!

Feb 26 2023 3:20 PM | Updated on Feb 26 2023 3:20 PM

Aamir Khan May Be Act In Rajamouli And Mahesh Babu Upcoming Movie - Sakshi

ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసించిన హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకడు. అయితే 6 ఏళ్లుగా ఆమిర్ ఖాన్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ వీక్ గా ఉంది. దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కనీసం హిట్ సినిమా అందించేందుకు ఆమిర్ చాలా కష్టపడుతున్నాడు. 2017లో సీక్రెట్ సూపర్ స్టార్, 2018లో తగ్స్ ఆఫ్ హిందుస్తాన్, లాస్ట్ ఇయర్ లాల్ సింగ్ చెద్దాలో కనిపించాడు. ఈ మూడింటికి మూడు కూడా ఆమిర్ ఖాన్ రేంజ్ మూవీస్ గా నిలవలేకపోయాయి.

ఇలా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ బెడిసి కొడుతుండటంతో ఆమిర్ చూపు ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కే పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై పడిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తారక్ నటించే చిత్రంలో ఆమిర్ ఖాన్ కూడా నటించబోతున్నాడని ప్రచారం మొదలైంది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ బాబు నటించబోతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లోనూ ఆమిర్ ఖాన్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడంటూ టా‌క్ బయటికి వచ్చింది.

మార్చి 12న ఆస్కార్ వేడుక పూర్తైన తర్వాత రాజమౌళి పూర్తిస్థాయిలో మహేష్ మూవీపై ఫోకస్ పెట్టనున్నాడు. ఇయర్ ఎండ్ కు సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ దశలో ప్రాజెక్ట్ బిగిన్ అయ్యే లోపు ఇంకెన్ని రూమర్స్ వస్తాయో చూడాల్సి ఉంది. ఒక వేళ నిజంగానే మహేష్ సినిమాలో ఆమిర్ ఖాన్ కూడా ఎంట్రీ ఇస్తే ఆ మూవీని రాజమౌళి చైనాలో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమిర్ కు చైనాలో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement