మాట్లాడుతున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆదేశించారు. గురువారం మున్సిపల్ కమిషనర్ సాయికుమార్, ఏఈ కిష్ణయ్య, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో 29 పనులు చేపట్టేందుకు రూ.15 కోట్ల చాలా కాలం క్రితం మంజూరయ్యాయి. వాటిలో 13 పనులు చేపట్టారని, మిగిలిన పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఇండోర్ స్టేడియానికి మరిన్ని నిధులు ఇవ్వాలని మంత్రిని కోరినట్లు వివరించారు. 731 సర్వే నంబర్‌లో ఆయా అభివృద్ధి పనులకు గతంలో కేటాయించిన విధంగానే భూముల కేటాయింపులు ఉంటాయని చెప్పారు. రాయరావు చెరువు సుందరీకరణకు నిధు లు వచ్చాయని తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది పట్టణంలో సేకరించిన చెత్తను డంప్‌యార్డుకు తరలించకుండా రోడ్ల పక్కన పారవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలా చేయకుండా చర్యలు తీసుకో వాలని కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ నాయకులు శేఖర్, బాల్‌రెడ్డి, భిక్షపతి, సత్యంగౌడ్, షేక్ హుస్సేన్, రాజు, మోహిజోద్దీన్, ప్రసాద్, మహేందర్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


