రేగోడ్(మెదక్): పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం అవుతోందని పీసీసీ సభ్యుడు కిషన్ అన్నారు. మండల పరిధి తిమ్మాపూర్ గ్రామంలో లబ్ధిదారు సాయమ్మ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును సర్పంచ్ నిర్మలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పేదలకు వరమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేందర్ సింగ్, దర్శన్, భాగయ్య, మధు, దుర్గయ్య, సంగమేశ్వర్, కృష్ణ, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.


