చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని అంబాజిపేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుకామాత ఆలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హోమంలో పాల్గొని ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో అంత సుభిక్షంగా ఉండాలని కోరారు.
నర్సాపూర్: ప్రభుత్వం అందజేసే లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్‌ఓసీ)తో మెరుగైన వైద్యం పొందే వీలుంటుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని చండూర్, కొన్యాల, వెల్దుర్తి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎనిమిది లక్షల 25వేల రూపాయల విలువ చేసే ఎల్‌ఓసీలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు నిమ్స్‌లో వైద్యం పొందాల్సి వచ్చినప్పుడు ఎల్‌ఓసీలు ఉపయోగపడతాయని, వారిపై ఆర్థిక భారం పడదని వివరించారు. అవసరమైన పేదలకు ఎల్‌ఓసీలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి అందచేస్తున్నట్లు చెప్పారు.
తూప్రాన్: మండల కేంద్రం మనోహరబాద్‌లో నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సత్తిరెడ్డి తెలిపారు. మంగళవారం హిందూ సమ్మేళన ప్రచార వాహనానికి కాళ్లకల్ బంగారమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ.. హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేష్‌గౌడ్, గోపాల్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట(మెదక్): మండల పరిధి జెడ్ చెరువు తండాకు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. దీంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్‌ఐ రాజేష్ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం గుంతలను గుర్తించి ఎస్‌ఐ, సర్పంచ్ బాబు వాటిని మట్టితో నింపారు. అలాగే, ఇతర గ్రామాలకు వేళ్లే రహదారిలో ఉన్న రోడ్లపై కూడా గుంతలను పూడ్చారు.
కౌడిపల్లి(నర్సాపూర్): సెంట్రింగ్ కార్మికులకు కంపెనీ తరఫున గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తామని జైరాజ్ స్టీల్ తెలంగాణ డీజీఎం రవిశంకర్ తెలిపారు. మంగళవారం కౌడిపల్లిలో సెంట్రింగ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల భద్రత కోసం కంపెనీ యజమాన్యం కృషి చేస్తుందని కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీలర్ పోల నవీన్‌కుమార్, కార్మికులు పాల్గొన్నారు.
ములుగు(గజ్వేల్): వంటిమామిడిలోని కూరగాయల మార్కెట్ యార్డు పనులకు సంబంధించిన పనుల పునరుద్ధరణ, అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా మని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, ములుగు మాజీ వైస్ ఎంపీపీ వి.దేవేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్ యార్డు కోసం భూ ములు కోల్పోయిన రైతులకిచ్చిన హామీ మేర కు 250 గజాల ఇళ్ల స్థలాలు అందజేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలసి వివరించనున్నట్లు చెప్పారు. అలాగే ఇళ్ల నిర్మాణాలకు ఇందిరమ్మ పథకం ద్వారా నిధులు మంజూరు చే యించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


